స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -227 లో.....శౌర్య కళ్లు తిరిగి కింద పడిపోయిందని అటెండర్ లాగా రౌడీ ఫోన్ చేసి చెప్పగానే.. దీప హడావిడిగా అనసూయకి చెప్పి బయలుదేర్తుంటుంది. దీప వెళ్తుంటే రౌడీ ఆటోతో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలని ఎక్కించుకుంటాడు. దీపని స్కూల్ కి కాకుండా వేరొక చోటుకి తీసుకొని వెళ్తాడు. అప్పటికే దీపకి డౌట్ వస్తుంది. మరికొంత మంది రౌడీలు దీప దగ్గరికి వస్తారు. దూరం నుండి జ్యోత్స్న, పారిజాతంలు చూస్తుంటారు.
మరొకవైపు శౌర్య పడిపోయిందట అని కార్తీక్ కి అనసూయ చెప్తుంది. ఏదైనా కాల్ స్కూల్ నుండి నీకు వస్తుంది కానీ తనకి రావడమేంటని కాంచన అనగానే.. కార్తీక్ హడావిడిగా వెళ్తాడు. మరొకవైపు దీప, రౌడీలని కొడుతుంది. దీపని రౌడీ కత్తితో పొడవబోతుంటే కార్తీక్ వచ్చి ఆపుతాడు. దాంతో జ్యోత్స్న, పారిజాతం లు షాక్ అవుతారు బావ వచ్చాడేంటని జ్యోత్స్న అంటుంది. దీప, కార్తీక్ లు ఇద్దరు కలిసి రౌడీలని కొడతారు. మీతో ఇలా చేయించింది ఎవరని కార్తీక్ రౌడీని అడుగగా కళ్ళలో మట్టి కొట్టి పారిపోతాడు. వాళ్లని కార్తీక్ ఎక్కడ చూస్తాడోనని జ్యోత్స్న, పారిజాతం లు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత కార్తీక్ , దీపలు ఇంటికి వచ్చి జరిగింది చెప్తారు. ఇదంతా ఆ నర్సింహా పని అని దీప అనుకుంటుంది కానీ కార్తీక్ మాత్రం హాస్పిటల్ లో జరిగింది గుర్తు చేసుకొని జ్యోత్స్న పని అనుకుంటాడు. మరొకవైపు బావకి మనపై డౌట్ వచ్చి ఉంటుందని జ్యోత్స్న అంటుండగా.. అప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తాడు. పారిజాతం భయపడుతూ మాట్లాడుతుంది. మీరే ఇదంతా చేసారని కార్తీక్ అంటాడు. మాకేం అవసరం నరసింహ రెండో భార్య చేసి ఉంటుందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.